482,రారాజు వస్తున్నాడో జనులారా
రారాజు వస్తున్నాడో జనులారా
రాజ్యము తెస్తున్నాడు
త్వరపడి వేగమే రండి ప్రియులరా
ప్రభుని చేరగా రండి
వస్తన్నన్న యేసు రాజు రాకమానునా 2
తెస్తన్నాన్న బహుమానం తేకమానునా
1.పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన 2
మహిమకు యేసే మార్గము జీవము
అందుకే నమ్ముకో యేసుయ్యనూ.... 2
పొందుకొ నీ పాప పరిహారము ... 2
వస్తన్నన్న యేసు రాజు రాకమానునా
తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 2
2. పాపం చేయొద్దు మహా శాపమయ్యే
నీ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు 2
యేసుయ్య గాయాలు స్వస్థకు కారణం
యేసుయ్య గాయాలు రక్షణకు మార్గము
అందుకే నమ్ముకో యేసుయ్యనూ....
పొందుకొ నీ పాప పరిహారము ... 2
వస్తన్నన్న యేసు రాజు రాకమానునా
తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 2
3.కను రెప్ప పాటున కడబూర మ్రోగగా
పారమున ఉందురు నమ్మినవారందరు 2
నమ్మనివారందరూ శ్రమల పాలౌతారు 2
అందుకే నమ్ముకో యేసుయ్యనూ....
చేరుకో పరలోక రాజ్యమందును ... 2
వస్తన్నన్న యేసు రాజు రాకమానునా
తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 2
