475,సమర్పణ చేయుము ప్రభువునకు

475,సమర్పణ చేయుము ప్రభువునకు

bookmark

సమర్పణ చేయుము ప్రభువునకు 
నీ దేహము ధనము సమయమును (2)

1.అబ్రహామును అడిగెను ప్రభువపుడు – ఇస్సాకును బలిగా ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా   (2) నీ విచ్చెదవా IIసమర్పణII

2.అయిదు రొట్టెలు చేపలు రెండు – ఐదువేలకు ఆహారముగా (2)
అర్పించెనా బాలుడొకటి వేళ (2) అట్లిచ్చెదవా IIసమర్పణII

3.ప్రభుని ప్రేమించిన పేదరాలు – కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెదన్ (2) నీ విచ్చెదవా IIసమర్పణII

4.నీ దేహము దేవుని ఆలయము – నీ దేవుడు మలచిన మందిరమ
సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీ విచ్చెదవాIIసమర్పణII