47,ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా

47,ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా

bookmark

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
ఈలాటి స్నేహితుడు
నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు
ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు

1.హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా
ప్రేమ చూపువారు లేరు లోకమందునా
నేను కోరుకోకుండా నాకోసము
తనకు తాను చేసినాడు సిలువయాగము ||ఎవరైనా||

2.అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా
జతనుకోరువారు దొరకరు ఎంత వెదకినా
నీచుడనని చూడకుండా నాకోసము
మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము||ఎవరైనా||

3.స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా
మేలు చేయువారు ఎవరు విశ్వమందునా
ఏమి దాచుకోకుండా నాకోసము
ఉన్నందతా ఇచ్చినాడు ఏమి త్యాగము ||ఎవరైనా||