466,రాయబారులం మేము రాయబారులం
రాయబారులం మేము రాయబారులం -
రాయబారులం క్రీస్తు రాయబారులం
1.సువార్తను చాటుటయే మేము మా ధ్యేయం -
సర్వ జనుల రక్షణయే మా భారం
చాటుతూ సువార్తను చాటుదాం సరిహద్దులు
చాటుతూ సహరిద్దులు దాటుదాం ||రాయబారులం||
2.కల్వరి గిరి కష్టాలే మా ధ్యేయం -
కన్నీళ్లు కష్టాలే మా గమ్యం
చాటుతూ సువార్తను దావటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు దాటుదాం ||రాయబారులం||
3.నశించుచున్న ఆత్మలయే మా ధ్యేయం -
నలుమూలల చాటుటయే మా గమ్యం
చాటుతూ సువార్తను దాటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు దాటుదాం ||రాయబారులం||
4.పాపము పై పొందెదము ఘన విజయం -
సాతానును పోరాడి గెలిచెదము
చాటుదాం...సువార్తను దాటుదాం సరిహద్దులు -
చాటుతూ సరిహద్దులు
దాటుదాం రాయబారులం మేము రాయబారులం ||రాయబారులం||
