455,యేసే నా ఆశ్రయము – యేసే నా ఆధారము

455,యేసే నా ఆశ్రయము – యేసే నా ఆధారము

bookmark

యేసే నా ఆశ్రయము – యేసే నా ఆధారము (2)
నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే (2)

1.శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా - కష్టాల ఊబిలో కూరుకున్నను (2)
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును - నాకు శక్తినిచ్చి నడిపించును (2)IIయేసేII

2.జీవ నావలో తుఫాను చెలరేగినా - ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)
నాకు తోడుండును నన్ను దరిచేర్చును - చుక్కానియై దారి చూపును (2)IIయేసేII