453,యెహోవాయే నా కాపరిగ - నాకేమి కొదువగును
యెహోవాయే నా కాపరిగ - నాకేమి కొదువగును (2)
1. పచ్చికగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును (2)
శాంతికరమైన జలములలో - నన్నాయనే నడిపించును (2)IIయెహోవాయేII
2. గాఢాంధకార లోయలలో - నడచిన నేను భయపడను (2)
నీ దుడ్దుకర్రయు నీ దండమును - నన్నాయనే ఆదరించును (2) IIయెహోవాయేII
3. నే బ్రతుకు దినములన్నియు - కృపాక్షేమములే నా వెంటవచ్చును (2)
నే చిరకాలం యెహోవాయే - మందిరములో నివసింతును (2)IIయెహోవాయేII
