451,యెహోవా నా కాపరి నాకు లేమి లేదు

451,యెహోవా నా కాపరి నాకు లేమి లేదు

bookmark

యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్IIయెహోవాII

1.మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభు యేసు నన్ను – కరుణతో ఆదరించున్IIయెహోవాII

2.పగవారి యెదుట ప్రేమతో నొక విందు
ప్రభు సిధ్ధము చేయున్ – పరవశమొందెదన్IIయెహోవాII

3.నూనెతో నా తలను – అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నదిIIయెహోవాII

4.చిరకాలము నేను – ప్రభు మందిరములో
వసియించెద నిరతం – సంతస మొందెదనుIIయెహోవాII