449,మిత్రమా నా మిత్రమా ` చిత్తమా
మిత్రమా నా మిత్రమా ` చిత్తమా ఇది నీ చిత్రమా
మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే
నీతో స్నేహం నాకు ప్రాణం ` నాతో బంధం అది నీ త్యాగం
మిత్రమా నా మిత్రమా ` చిత్రము ఇది చిత్రము
మిత్రమా నా మిత్రమా ` చిత్తమా ఇది నీ చిత్రమా
మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే
స్నేహం నీ స్నేహం ` ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం ` ప్రాణం నీ స్నేహం
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా `
ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా ‘2’
1 :మట్టిని మనిషిగ మచినావు ` మనిషిని మమతతో నింపినావు
మమతకు మంచిని నేర్పినావు ` మంచికి మనసును ఇచ్చినావు
మట్టిని మనిషిగ మచినావు ఎందుకో `
మనిషిని మమతతో నింపినావు ఏమిటో
మమతకు మంచిని నేర్పినావు ఎందుకో`
మనసుకు మనసును కలిపినావు
ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’
2:కంటినీరు తుడచినావు ` కంటికి రెప్పై నిలిచినావు
వింతగ నన్ను వచినావు ` తండ్రివై నన్ను పిలిచినావు
రతణా రాసులో నిలిచే నీవెక్కడ `
బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’
