436,భీకరుండౌ మా యెహోవా
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే IIభీకరుండౌII
1.మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము IIభీకరుండౌII
2.ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము IభీకరుండౌII
3.పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని IభీకరుండౌII
4.మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను IIభీకరుండౌII
5.మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను IIభీకరుండౌII
