426,ప్రేమా అనే మాయలో చిక్కుకున్న

426,ప్రేమా అనే మాయలో చిక్కుకున్న

bookmark

ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరీ (సోదరా)
కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై (2)

1.తల్లిదండ్రులు కలలు కని రెక్కలు ముక్కలు చేసుకొని (2)
రక్తము చెమటగా మార్చుకొని నీపైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే.. పట్టణం పంపిస్తే.
ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి (2)
కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై (2)

2.ప్రభు ప్రేమను వదులుకొని ఈలోక ఆశలు పట్టుకొని (2)
యేసయ్యక్షమను వలదని దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే.. తనువును చాలిస్తే..
నరకము చేరుకొని అగ్నిలో కూరుకొని (2)
కొన్నతండ్రి కలలకు దూరమై కష్టాల కడలికి చేరువై (2)