419,నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా
నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా ...
నీ దరికి నడిపించు నావా - నా జీవనావ||నాలోని||
1.నిను నేను ఈ జగానా కొనియాడనా
అనువైన పాట పాడి వినుతింపగా (2)
నీ పద సేవ చేయగ దేవా
ఎనలేని జీవమును ఒనగోర్చుమయ్యా ...||నాలోని||
2.నా హృదయ ఆలయాన నివసింపుమా
నీ మహిమ మందిరాన నను నిల్పుమా (2)
పావన నామా - జీవన ధామా
నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా...||నాలోని||
