411,నీ ప్రేమయే నాకు చాలు -
నీ ప్రేమయే నాకు చాలు - నీతోడు నాకుంటే చాలు
నా జీవితాన - ఒంటరి పయనాన - నీ నీడలో నన్ను నడిపించుమా (2)
యేసయ్యా…యేసయ్యా…యేసయ్యా... యేసయ్యా… యేసయ్యా.. (2)
1.నీ ప్రేమతోను, నీ వాక్కుతోను – నిత్యము నన్ను నింపుమయ్యా
నీ ఆత్మతోను, నీ సత్యముతోను – నిత్యము నను కాపాడుమయ్యా
నీ సేవలో నీ సన్నిధిలో –
నీ మాటలో నీ బాటలో - నిత్యము నను నడిపించుమయ్యా
IIయేసయ్యాII
2.నువు లేక నేను జీవించలేను – నీ రాకకై వేచియున్న
నీవులేని నన్ను ఊహించలేను – నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూపమే –
నా ధ్యాసలో నీ ధ్యానమే - నీ రూపులో మార్చెనయ్యా
IIయేసయ్యాII
