375,కృప వెంబడి కృపతో నను ప్రేమించిన
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
నను కరునించిన నాయేసయ్యా
1. నా యెడల నీకున్న తలంపులు -
బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవా
అవి వర్ణించలేను నా యేసయ్యా -
అవి వివరించలేను నాయేసయ్యా
నా యెడల నీకున్న వాంఛలన్నియు
2. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని -
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని
విడువక ఎడబాయని నాయేసయ్యా -
మరువక ప్రేమించిన నా యేసయ్యా
ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా
