357,ఏ బాధ లేదు ఏ కష్టం లేదు
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా...
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా...
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
1.ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా
సాతానే శోధించినా శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా…
2.పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా…
