350,ఈ దినం సధా
ఈ దినం సధా - నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత - నా తోడ నడచును (2)
రానున్న కాలము - కలత నివ్వదు (2)
నా మంచికాపరి సధా - నన్ను నడుపును (2)
1.ఎడారులు, లోయలు, ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాట అయినను (2)
వెరవదెన్నడైనను నాదు హృదయము (2)
గాయపడిన యేసుపాదం ముందు నడిచినే (2) IIఈ దినంII
2.ప్రవాహంవలె శోధకుండు ఎదురువచ్చినా
యుధ్ధకేక నా నోట యేసు నామమే (2)
విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు (2)
యెహోవా నిస్సియే నా విజయము (2)IIఈ దినంII
