333,హల్లెలూయ అని పాడిస్తుతింపను

333,హల్లెలూయ అని పాడిస్తుతింపను

bookmark

హల్లెలూయ అని పాడిస్తుతింపను 
రారే జనులారా మనసార ఊరూర
రారే జనులారా ఊరూర నోరార

1.పాడిపంటలనిచ్చి పాలించు దేవుడని
కూడుగుడ్డనిచ్చి పోషించు దేవుడని
తోడు నీడగ నిన్ను కాపాడు నాదుడని
పూజించి పూజించి పాటించి చాటించరారె ||హల్లే||

2.తాత ముత్తవుల కన్న ముందున్న దేవుడని
తల్లిదండ్రులకన్న ప్రేమించు దేవుడని
కల్లాకపటములేని కరునా సంపన్నుడని
పూజించి పూజించి పాటించి చాటించరారే ||హల్లే||

3.బంధుమిత్రులకన్న బలమైన దేవుడని
అన్నదమ్ముళ్ళకన్న ప్రియమైన దేవుడని
కన్నబిడ్డలకన్న కన్నుల పండుగని
పూజించి పూజించ పాటించి చాటించరారే ||హల్లే||