316,సీయోను పాటలు సంతోషముగా
సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము
1.లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు ||సీయోను||
2.ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి ||సీయోను||
3.మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము ||సీయోను||
4.ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి ||సీయోను||
