306,సందేహమేల - సంశయమదేల
సందేహమేల - సంశయమదేల
ప్రభు యేసుగాయములను పరికించిచూడు
గాయాలలో నీవ్రేలు తాకించి చూడు
1.ఆ ముండ్లు మకుటము నీకై - ధరియించెనే
నీ పాప శిక్షను యేసు భరియించెనే (2)
ప్రవహించె రక్తధార నీ కోసమే
కడు గోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహ||
2.లోకాన ఎవ్వరు నీకై మరణించరు
నీ శిక్షలను భరయింప సహయింపర (2)
నీ తల్లియైన గాని నిను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా (2) ||సందేహ||
3.ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు
ఎందాక హృదయము బయట నిలువ మందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహ||
4.ఈ లోక బోగాలను వీడజాలవా
సాతాను బందకమందే సంతసింతువా (2)
యేసయ్య సహనము తోడ చెలగాటమా
ఈ నాడే రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహ||
