298,సమర్పణ చేయుము ప్రభువునకు

298,సమర్పణ చేయుము ప్రభువునకు

bookmark

సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (2)

1.అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||

2.ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||

3.నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||