295,సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా

295,సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా

bookmark

సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా
సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా
యువజనమా - యేసులో   బలపడుమా
జడియకుమా - యేసుకే పరుగెడుమా

1.జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం
నీ యవ్వన బలం యేసుకే వాడినా
జీవితమే ఫలవంతం ||యువ||

2.ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం
లోకాశలను జయించి సాగిన
చేరదవు పరలోకం ||యువ||

3.దేవునితోటయే సంగం 
పనిచేయుట నీ ధర్మం
నీ వరములను రెట్టింపు చేసిన
పొందెదవు  బహుమానం ||యువ||