292,శ్రీ యేసే కద నను గాచినది

292,శ్రీ యేసే కద నను గాచినది

bookmark

శ్రీ యేసే కద నను గాచినది
సాతాను కన్నులకు నను మరుగు చేసి
మపదనిసా .... నిరిసరినీ 
గమపదనీ ..... నిరిసరిసా (2)

1.నా వంటిరి రాత్రి ప్రయాణములలో 
నాతో నడిచి ననునగాచెనుగా
దుష్టుల దుష్టముకు నను బలిచేయక 
ఈదినము వరకు నాకు రక్షయై ||శ్రీ||

2.తల్లి దండ్రి తోబుట్టువులు
త్రోసి వేసినను నన్ను చేరదీసి
హస్తకృతములో నివసించలేదు
శరీర ఆహారము భుజించగలేను ||శ్రీ||

3.క్రీస్తేసు రెక్కలు నాకు నివాసమై
నివసించుచున్నాను ఆయన నీడలో
నా యేసు ప్రేమను తలంచినేను
స్తుతించగ లేక వుండలేను ||శ్రీ||