265,యుద్ధ వీరుడా కదులుముందుకు
యుద్ధ వీరుడా కదులుముందుకు - పాలు తేనెల నగరకు
వెట్టిచాకిరి పోయె వెనుకకు - విడుదలిచ్చెగా రక్తం మనలకు
‘లేదు మనకిక అపజయం యేసు రక్తమె మన జయం
హల్లెలూయ ! హొసన్న ! - (3) మనదే విజయం
హల్లెలూయ ! హొసన్న ! - (3) మనదే విజయం ||lయుద్ధ వీరుడా||
1.ఏదేమైన గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము
ఎర్రసంద్రమైన యెరికో గోడలైన మేం వెనుకడుగు వేయము
యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతాం
అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతాం ||లేదు||
2.పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా
చింతయే లేదుఏ కొదువ లేదు నిస్సత్తువే రాదుగా
ఆకలి తీర్చి మన్నా కురియును యేసుని నీడలో
దాహము తీర్చ బండయే చీలెను కలువరి సిలువలో ||లేదు||
3.గొర్రెపిల్ల రక్తం దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం
శక్తిచేత కాదు బలము చేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం
యేసుని గొప్ప వాగ్ధానములే నింపెను నిబ్బరం
యేసుని యందు వశ్వాసమె మా విజయపు సూచకం ||లేదు||
