260,యేసు రాజుగా వచ్చుచున్నాడు

260,యేసు రాజుగా వచ్చుచున్నాడు

bookmark

యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకుంటారు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
రారాజుగా వచ్చుచున్నాడు యేసు (2)

1.మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు 
పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు (2)
లోకమంతా శ్రమకాల విడువబడుట బహుగోరం (2) ||యేసు||

2.ఏడేళ్ళ పరిశుద్ధులకు విందౌ బోతుంది
ఏడేళ్ళ లోకము మీదకి శ్రమరాబోతుంది (2)
ఈ సువార్త మూయబడున్‌ వాక్యమే కరువగును (2) ||యేసు||

3.వెయ్యేళ్ళ ఇలపై యేసురాజ్యమేలును
ఈలోక రాజ్యాలన్నీ ఆయన ఏలును     (2)
నీతి శాంతి వర్ధిల్లున్‌ న్యాయమే కనబడును (2) ||యేసు||

4.ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించున్‌ గడగడలాడును (2)
వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవును (2) ||యేసు||

5.సోదరుడా మరువద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధన చేయుము సిద్ధముగా నుండి    (2)
రెప్పపాటులో మారాలి యేసయ్య చెంతకు చేరాలి (2) ||యేసు||