240,మార్గము చూపుము ఇంటికి
మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి (2)
1.పాప మమతల చేత
పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము
పశ్చాత్తాప్పమునోంది
తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము (2)
ప్రభు నీదు సిలువ
ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2) ||మార్గము||
2.దూర దేశములోన
బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను
నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము (2)
దాక్షిణ్య మూర్తి నీ
దయ నాపై కురిపించి ధన్యున్ని చేయుము (2) ||మార్గము||
3.నా తండ్రి నను జూచి
పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి
ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2)
నా జీవిత కథయంత
యేసు ప్రేమకు ధరలో సాక్షమై యుందును (2) ||మార్గము||
