237,మధురమైనది నా యేసు ప్రేమ

237,మధురమైనది నా యేసు ప్రేమ

bookmark

మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతిమధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమ. . . ప్రేమ. . . నా యేసు ప్రేమ

1.ఇహలోక ఆశలతో అంధులమైతిమి
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి
నీ సన్నిధిలో నిలపిన నీ ప్రేమ మధురం ||ప్రేమ||

2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గములుచూపి మన్నించితివి
మరణపు ఛాయలే దరి చేరనీయక
నీలో నను నిల్పిన నీ ప్రేమ మధురం ||ప్రేమ||