232,మానసవీణను శృతిచేసి

232,మానసవీణను శృతిచేసి

bookmark

మానసవీణను శృతిచేసి 
మనసు నిండా కృతజ్ఞత నింపి
గొంతెత్తి స్తుతిగీతములే పాడవా
వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా

1.వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా
సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా
స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం
దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం

2.శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి
దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి
మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే
స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవా