224,భాసిల్లెను సిలువలో పాప క్షమ

224,భాసిల్లెను సిలువలో పాప క్షమ

bookmark

భాసిల్లెను సిలువలో పాప క్షమ 
యేసు ప్రభూ నీ దివ్య క్షమ

1.కలువరిలో నా పాపము పొంచి 
సిలువకు నిన్ను యాహుతి జేసె
కలుషహరా... కరుణించితివి ||భాసిల్లెను||

2.దోషము చేసినది నేనేకదా 
మోసముతో బ్రతికిన నేనేకదా
మోసితివా .... నా శాపభారం    ||భాసిల్లెను||

3.పాపము చేసి గడించితి మరణం 
శాపమేగా నే నార్జించినది
కాపరివై... నను బ్రోచితివి ||భాసిల్లెను||

4.నీ మరణపు వేదన వృధా కాదు
నా మది నీ వేదనలో మునిగె
క్షేమము.... కలిగెను హృదయములో ||భాసిల్లెను||