21,ఆధారం నాకు ఆధారం
ఆధారం నాకు ఆధారం
నాకు తోడు నీడై యున్ననీ కృపయే ఆధారం
ఆశ్రయము - నా ఆశ్రయము
ఆపత్కాలమందు ఆశ్రయము
నీ నామం ఆశ్రయము
తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా
లోకమంతా ఒకటైనా బాధలన్ని బంధువులైనా||ఆ||
1.భక్తి హీన బంధంలో నేనుండగా (2)
శ్రమల సంద్రంలో పడియుండగా (2)
యిరుకులో, విశాలతను, కలిగించిన దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ||ఆ||
2.దారిద్య్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి (2)
నీ స్వరమే నావరమై నడిపించిన యేసయ్యా (2)
విడువను, ఎడబాయనని పలికిన నాదేవా (2)
నీ చల్లని ఒడిలో నను చేర్చగరావా ||ఆ||
3.దిగులు పడిన వేళలో దరిచేరిన దేవా (2)
అవమానపు చీకటిలో బలమిచ్చిన నాదేవా (2)
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నాదేవా (2)
నీ చల్లని ఒడిలో నను చేర్చగరావా ||ఆ||
