205,పదే పదే నేను పాడుకోనా

205,పదే పదే నేను పాడుకోనా

bookmark

పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నా పాటగా
మరీ మరీ నేను చాటుకోనా మనసంతా పులకించ నీ సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే
మమతల మహారాజా - యేసురాజా 
మమతల మహారాజ  - నా యేసురాజా

1.అడగక ముందే అక్కర లెరిగి 
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే 
బంధాలను పెంచిన భాగ్యవంతుడా
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా 
బంధాలను పెంచిన భాగ్యవంతుడా ||ప||

2.అలిగిన వేళ అక్కున చేరి 
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నాదరిచేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్నీ పెంచిన నాన్నవునీవే ||ప||