176,నిన్నే నిన్నే కొలుతునయా
నిన్నే నిన్నే కొలుతునయా
నీవేనీవే నారాజువయ్యా
1.కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా నన్ను నడిపించినావా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||నిన్నే||
2.ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులే నను అపహసించగా
అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా (2)
3.మరణచ్ఛాయలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా నిన్నే
ఘనపరతునయ్యా యేసయ్యా... యేసయ్యా (2)
4.వంచెన వెంచెన ఓరిగిన భారాన్న
పొసగక విసిగిన విసిరే కెరటానాన్న
కలలా కడతేర్చినావా
నీవలలో నను మోసినావా యేసయ్యా (2) ||నిన్నే||
