174,నిన్ను కాపాడు దేవుడు
నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి
మాట తప్పడు నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు (2)
ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||
1.శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా (2)
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా (2) ||భయమేల||
2.రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) ||భయమేల||
