167,నా ప్రియమైన యేసు ప్రభు

167,నా ప్రియమైన యేసు ప్రభు

bookmark

నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు
నీవిచ్చినా రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు ||నా||

1.ఒక క్షణ సమయములో నశియించు నా జీవితం
నా హృదయం మార్చితివి దేవా కృపతో నే జీవించుటకై ||నా||

2.ఈ దినము నే పాడుట నీవలనే యేసు ప్రభు
ఎల్లప్పుడు నేపాడెదన్‌ దేవా నా యందు వశియించుము ||నా||

3.లోకపు పాపములో నేపాపిగా జీవించితిని
శుద్దా హృదయమిచ్చావు దేవా నీయందే జీవించుటకై ||నా||

4.ఆపద దినములలో నా ప్రభువుని తలంచితివి
దేవా నీదయతోడనే నాదా ఆశీర్వాదం నొందితిని ||నా||