16,ఆలయంలో ప్రవేశించండి అందరు
ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం - సుస్వాగతం
యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా, కలతలా
మీ హృదయంలో బాధలా, కలతలా
మీ హృదయంలో బాధలా, కన్నీళ్ళా,
మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసుకోసం ||ఆలయం||
1.దీక్ష స్వభావంతో త్యాగ స్వభావమై వెతికేవారికంతా
కనబడు దీపమై యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరును రారండి
ఆనందం.... ఆనందం ..... హల్లేలూయా||ఆలయం||
2.ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని మాటలై
పలికెదం మంచి మాటలే హృదయమంత
యేసు ప్రభుని జీవమాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందం.... ఆనంద.... హల్లేలూయా ||ఆలయం||
