143,నడిపిస్తాడు నాదేవుడు

143,నడిపిస్తాడు నాదేవుడు

bookmark

నడిపిస్తాడు నాదేవుడు 
శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా  (2)
చెయిపట్టి వెన్నుతట్టి చక్కకు ఆలోచన చెప్పి  (2)

1.అంధకారమే దారిమూసినా - 
నిందలె నన్ను కృంగదీసినా  (2)
తన చిత్తం నెరవేర్చుతాడు 
గమ్యం వరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||

2.కష్టాలు కొలిమి కాల్చివేసిన 
శోకాలు గుండెను చీల్చివేసినా

తన చిత్తం నెరవేర్చుతాడు  
గమ్యంవరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||

3.నాకున్న కలిమి కలిగిపోయినా
నాయొక్కబలిమి తరిగిపోయినా

తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యంవరకు నను చేర్చుతాడు ||నడిపిస్తాడు||