133,దేవా నీ దివ్య వాక్యము

133,దేవా నీ దివ్య వాక్యము

bookmark

దేవా నీ దివ్య వాక్యము
ఈవిగ మాకు దొరికెను
హల్లెలూయ హల్లెలూయ

1.పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే
కల్వరికి నడిపించి - కలుషమును తొలగించి 
మా హృదయము వెలిగించెను, ఆ.... ||దేవా||

2.వానవంటి వాక్యము తేనె కంటె మధురము
వెండి బంగారముల వెల ఎంత అయినను
తుల తూగదు నీ వాక్యముతో ||దేవా||

3.నీ వాక్యము నీరై యుండెన్‌ మా దాహము
తీర్చుచుండెను ఆ నీరే మాకు
ప్రాణము పానము నీ వాక్యము
మా కీయుమా ||దేవా||

4.నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము
వంటిది - నీ పాలలో మము
పెంచి నీ తోటలో మము ఉంచి
నీ బలము మా కీయుమా ||దేవా||

5.వాక్యముతో నింపితివి సాక్ష్యులుగా 
పంపితివి  నీ చేతి లోమము దాచి
నీ చూపులో మము కాచి నీ సన్నిధి 
మా కీయుమా ||దేవా||