119,త్రాహి మాం క్రీస్తు నాధ

119,త్రాహి మాం క్రీస్తు నాధ

bookmark

త్రాహి మాం క్రీస్తు నాధ-దయఁజూడ రావే = నేను-దేహి యనుచు నీ
పాదములే - దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||

1గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుఁడనై - రవ్వపాలై నే నెంతో - నెవ్వ
ఁబొందితిఁ - త్రవ్వుచున్న కొలఁదిఁ - పెరుఁగుఁ- దరగదు నా పాప రాశి
- యివ్విధమునఁ జెడిపోతినినే - నేమి సేతు నో¬¬¬ ||త్రాహి||

2.నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జాచిత్తముఁ బూని - చేయరాని
దుష్కర్మములు చేసినాఁడను = దయ్యాలరాజు చేతిలో ఁ - జేయి వేసి వాని
పనులఁ- జేయ సాగి నే నిబ్భంగిఁ - జెడిపపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||

3.నిబ్బర మొక్కంచుకైన-నిజము రవ్వంతైన లేక- దబ్బర లాడుటకు
ము-త్తాత నైతిని= అబ్బురమైన ఘోర పా -పాంధకార కూపమందు -
దబ్బున బడిపోయినయ్యో  - దారి చెడి నేనబ్బబ్బబ్బా    ||త్రాహి||