104,చూడుము ఈ క్షణమే కల్వరిని

104,చూడుము ఈ క్షణమే కల్వరిని

bookmark

ప్రేమ ప్రభువు - నీకై నిలుచుండెను
గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడే - చున్నాడుగా

1.మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము - 
నిక్కమని నరకమున్నదని వారెరుగరు ||చూడు||

2.ఇహమందు నీకు కలవన్నియు చనిపోవు సమయాన
వెంటరావు చనిపోయిననను నీవు లేచెదవు
తీర్పున్నదని యెరుగు ఒక దినమున ||చూడు||

3.మనలను ధనవంతులుగా చేయను దరిద్రుడాయెను
మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై
అంగీకరించుము క్రీస్తేసుని ||చూడు||

4.సిలువపై చూడగ ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు
యేమిత్తువు అర్పించుకో నీడు జీవితము
ఆయన కొరకై జీవించుము ||చూడు||