శ్రీమన్నారాయణ
"శ్రీమన్నారాయణ:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ |
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||
కమలాసతీ ముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ |
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీపదకమలమే శరణు ||
పరమయోగిజన భాగధేయ శ్రీ
పరమపూరుష పరాత్పర |
పరమాత్మా పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరి దేవ శరణు ||"
