రామ లాలీ
"రామ లాలీ:
రామ లాలీ రామ లాలీ
రామ లాలీ రామ లాలీ ||
రామ లాలీ మేఘశ్యామ లాలీ
తామరసా నయన దశరథ తనయ లాలీ |
అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ||
జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ||
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు ||"
