మనుజుడై పుట్టి

మనుజుడై పుట్టి

bookmark

"మనుజుడై పుట్టి:

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ||

జుట్టెదు కడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి |
పుట్టినచోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన |

అందరిలో పుట్టి అందరిలో పెరిగి
అందరి రూపములు అటుతానై |
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదము అందనటుగాన ||"