నిత్య పూజా విధానం-4

నిత్య పూజా విధానం-4

bookmark

నైవేద్యం
(నివేదన పదార్ధములపై నీరు చిలుకుచూ)
శ్లో|| ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం |
భర్గోదేవస్య ధీమహి - ధీయోయోనః ప్రచోదయాత్ ||
(క్రింది మంత్రం చెపుతూ పుష్పంతో నీటిని నైవేద్యం చుట్టూ 3సార్లు సవ్య దిశలో తిప్పాలి)
(నైవేద్యం పగలు సమయంలో పెడితే)
ఓం స్వత్యంత్వర్తేన పరిషించామి
(నైవేద్యం రాత్రి సమయంలో పెడితే)
ఋతంత్వా సత్యేన పరిషించామి
(పుష్పంతో నైవేద్యంపై జలం ఉంచి)
అమృతమస్తు
(అదే జలపుష్పాన్ని దేవుని వద్ద ఉంచి)
అమృతోపస్తరణమసి
ఓం లోకరక్షకాయ నమః --- నైవేద్యం సమర్పయామి
(5సార్లు దేవునికి నైవేద్యం చూపిస్తూ)
ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా -
ఓం వ్యానాయ స్వాహా - ఓం ఉదానాయ స్వాహా -
ఓం సమానాయ స్వాహా
(క్రింది మంత్రాలు చెపుతూ పుష్పంతో నీటిని దేవుడి పైన 5సార్లు చల్లాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
శుధ్ధాచమనీయం సమర్పయామి
******
తాంబూలం
ఓం కాలాయ నమః --- తాంబూలం సమర్పయామి
{తాంబూలమును (మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి}
తాంబూల చరవణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి
(తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి)
******
నీరాజనం
(కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన ఏకాహారతి దీపంతో వెలిగించాలి)
ఓం త్రిలోచనాయ నమః --- కర్పూర నీరాజనం సమర్పయామి
కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
(నీరు హారతి కుంది చివర వదలాలి)
******
మంత్రపుష్పం
(మంత్రపుష్పమునకు అక్షతలు, పుష్పములు తీసుకొని విడువవలయును)
శ్లో|| ఓం పురుషస్య విద్మహే మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్
ఓం శంకరాయ నమః --- సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
******
ప్రదక్షిణ నమస్కారం
(అక్షతలు, పుష్పము తీసుకొని ప్రదక్షిణము చేయ వలయును)
శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ |
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః |
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా ||
ఓం భవాయ నమః --- ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
******
సాష్టాంగ ప్రణామం
(మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి)
శ్లో|| ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా |
పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
******
క్షమాప్రార్థన
ఆ తరవాత మళ్లీ కూర్చుని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి)
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరః
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానావాహనాది షోడషోపచార పూజయాచ అష్టోత్తర నామార్చనాయచ మహా నివేదనాయచ భగవాన్‌ సర్వాత్మకః సర్వం శ్రీమహేశ్వర దేవతార్పణమస్తు
శ్రీ మహేశ్వర దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
(అంటూ అక్షతలనూ నీటినీ పళ్ళెంలో వదలాలి)
శ్లో|| ఉపచారాపదేశేన కృతాన్ అహర్ అహర్మయా |
అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ ||
ఓం మహేశ్వరాయ నమః - అపరాధ నమస్కారాన్ సమర్పయామి
శ్రీ పరమేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి
(పూజాక్షతలు శిరసున ధరించాలి)
******
విశేషోపచారములు
ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి
(నమస్కరించి అక్షతలు వేయాలి)
******
తీర్ధం
శ్లో|| అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీపరమేశ్వర పాదోదకం పావనం శుభమ్ ||
(తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను. ప్రసాదం స్వీకరించాలి)
******
ఉద్వాసన
ఓం పరమేశ్వరాయ నమః ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ
(అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇంట్లో చేసుకునే నిత్య పూజకు ఉద్వాసన చెప్పాల్సిన అవసరం లేదు)
******
శుభం భూయాత్...
పూజా విధానము సంపూర్ణం